సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 13:57:27

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో గౌతం గంభీర్‌

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో గౌతం గంభీర్‌

న్యూఢిల్లీ : మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. గంభీర్ నివాసంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టుల‌కు గంభీర్ త‌న న‌మూనాల‌ను పంపించాడు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఎవ‌రూ కూడా తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని గంభీర్ విజ్ఞ‌ప్తి చేశారు.  

ఢిల్లీలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అక్క‌డ క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లైంది. ప్ర‌తి రోజు 6 వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ప‌టాకుల వినియోగంపై ఢిల్లీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది.