శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 09:34:07

క‌రోనాకు మందు గోమూత్రం: ఎమ్మెల్యే హ‌రిప్రియ‌

క‌రోనాకు మందు గోమూత్రం: ఎమ్మెల్యే హ‌రిప్రియ‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 వ్యాధితో బాధ‌ప‌డేవారికి గోవు మూత్రం, ఆవు పేడ‌తో చికిత్స అందించ్చ వ‌చ్చు అని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సుమ‌న్ హ‌రిప్రియ తెలిపారు.  రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌యంలో బంగ్లాదేశ్‌కు అక్ర‌మంగా గోవులను త‌ర‌లిస్తున్నార‌న్న అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌లో పాల్గొన్న ఎమ్మెల్యే హ‌రిప్రియ‌.. గోవుల గొప్ప‌త‌నం గురించి చెప్పుకొచ్చారు.  క‌రోనా వైర‌స్ సోకిన వారికి కూడా గోమూత్రం ప‌నిచేస్తుంద‌న్నారు. ఆవు పేడ ఎంత విశిష్ట‌మైందో అంద‌రికీ తెలిసిందే, అలాగే గోవు మూత్రాన్ని కూడా చ‌ల్లితే, ఆ ప్రాంతాన్ని అది శుద్ధి చేస్తుంద‌ని, గోమూత్రం, ఆవుపేడ‌ల‌తో.. క‌రోనా వైర‌స్‌ను కూడా అదుపు చేయ‌వ‌చ్చు అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు.  క్యాన్స‌ర్‌తో పాటు ఇత‌ర అనేక వ్యాధుల‌కు గోవుల ద్వారా చికిత్స అందిస్తార‌ని,  గుజ‌రాత్‌లోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిట‌ల్లో.. క్యాన్స‌ర్ పేషెంట్ల‌ను గోవుల‌తో గ‌డిపేలా చేస్తార‌ని, వారికి పేడ‌ను రుద్దుతార‌ని, గోమూత్రం నుంచి త‌యారు చేసిన పంచామ్రుతాన్ని ఇస్తార‌ని ఆమె అన్నారు.   


logo