శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 01:16:58

గేట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

గేట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ: నిట్‌లు, ఐఐఈఎస్టీ షిబ్‌పూర్‌, ట్రిపుల్‌ ఐటీలతోపాటు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 2018, 2019, 2020 గేట్‌ పరీక్షల స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. ఇప్పటికే ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ వచ్చేనెల 12న ముగియనున్నది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది ఆన్‌లైన్‌ చాయిస్‌ ఫిల్లింగ్‌ వచ్చే నెల 5-12 మధ్య ముగుస్తుంది. జూన్‌ 17 సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులు జూన్‌ 17-20 మధ్య సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలి. logo