శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 16:26:32

గేట్ 2021 పరీక్ష: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గ‌డువు పొడిగింపు

గేట్ 2021 పరీక్ష: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గ‌డువు పొడిగింపు

ఢిల్లీ : గేట్ 2021 ప‌రీక్ష ఆన్‌లైన్ రిజిస్ర్టేష‌న్ గ‌డువును అక్టోబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (ఐఐటి-ముంబై) అధికారిక వెబ్‌సైట్ gate.iitb.ac.in. ‌లో గేట్ పరీక్ష దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసింది. అంతకుముందు గేట్ 2021 పరీక్ష ఆన్‌లైన్ నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే తాజాగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ గ‌డువును అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచుతూ నిర్ణ‌యం వెలువ‌రించారు. ఐఐటీ ముంబై ఫిబ్రవరి 2021లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 5 నుంచి 14 తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ.