ఆదివారం 31 మే 2020
National - May 07, 2020 , 13:14:28

విశాఖ ఉక్కిరిబిక్కిరి.. విషవాయువుకు 10 మంది బలి

విశాఖ ఉక్కిరిబిక్కిరి.. విషవాయువుకు 10 మంది బలి

ఎవరూ ఊహించని ఘటన.. విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రమాదకర విషవాయువు 10 మంది ప్రాణాలను తీసింది.  గాలిలో వ్యాపించిన ప్రమాదకర గ్యాస్‌ను పీల్చి జనం ఎక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు. నడుస్తూనే ఊపిరాడక బొక్కబోర్లా పడిపోయారు. చిన్నపిల్లల పరిస్థితి మరీ దారుణం. ఊపిరాడక ఉన్నచోటే పడిపోయారు. నోరులేని మూగ జీవాలను  చూస్తే దుఃఖమొస్తుంది. కిందపడి గిలగిల కొట్టుకుని నోట్లో నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచాయి. ఆవులు, కుక్కలు, పక్షులు ఇలా ఎన్నో నోరులేని జీవాలు నేలరాలాయి. 

అసలేం జరిగింది...

గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విషవాయువు లీకైంది. ఎల్జీపాలీమర్స్‌ అనే కంపెనీ నుంచి ఈ గ్యాస్‌ లీకైంది. తెల్లవారేలోపు సుమారు 3 కిలోమీటర్ల మేర విషవాయువు వ్యాపించింది. గాలిలో కలిసిన రసాయన వాయువును పీల్చి ఆ వాసనకు దగ్గుతూ ఉక్కిరిబిక్కిరయ్యారు జనం. ఇండ్లల్లో పడుకున్నవారు ఊపిరాడక, కళ్ల మంటకు తాళలేక బయటకు పరుగులు తీశారు. రోడ్డుపై నడస్తూనే కుప్పకూలిపోయారు. ద్విచక్ర వాహానాలపై వెళ్లేవారు సైతం గిర్రున తిరిగి పడిపోయారు. ఒకరిద్దరు మురుగు కాలువలో పడి చనిపోయారు. ఆ ఏరియా అంతా భయంకరంగా మారిపోయింది. జనం హాహకారాలు చేస్తూ ఉరుకులు పరుగులు తీశారు. 
logo