శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 01:14:46

మిస్డ్‌ కాల్‌ ఇస్తే గ్యాస్‌ బుకింగ్‌

మిస్డ్‌ కాల్‌ ఇస్తే గ్యాస్‌ బుకింగ్‌

న్యూఢిల్లీ:  ఇండేన్‌ గ్యాస్‌ కస్టమర్ల కోసం ‘ఇండియన్‌ ఆయిల్‌' సంస్థ ‘మిస్డ్‌ కాల్‌' సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గ్యాస్‌ రీఫిలింగ్‌ కావాల్సిన వాళ్లు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి ‘84549 55555’ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం ఈ సేవలను విస్తరించినట్టు పేర్కొంది. కాగా ఈ సేవలు ఇప్పటికే మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్నాయి.