గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 01:35:00

నాచు ఉద్యానవనం!

నాచు ఉద్యానవనం!

డెహ్రాడూన్‌: రంగురంగుల పూలు, అరుదైన మొక్కలు, గుబురైన పొదలతో కూడిన గార్డెన్‌లను మనం చూస్తుంటాం. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా నాచు ఉద్యానవనం (మాస్‌ గార్డెన్‌) సిద్ధమైంది. ఉత్తరాఖండ్‌లో నైనిటాల్‌ జిల్లాలోని ఖుర్పతాల్‌ పట్టణంలో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ జల సంరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్‌ ఈ నాచు గార్డెన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ప్రకృతి పరిరక్షణకు, వరదలను అడ్డుకునేందుకు నాచు ఏ విధంగా సాయపడుతుందో తెలియజేయడానికే ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేసినట్టు అటవీ శాఖ అధికారి సంజీవ్‌ చతుర్వేది తెలిపారు. 1.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశామన్నారు.