శనివారం 23 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:55:09

రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్‌

రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుందని, రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాతనే టీకా ప్రభావం కనిపిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాబట్టి కరోనా నిబంధనలను కొనసాగించాలని వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన రెండు టీకాలూ సురక్షితం, సమర్థవంతమని, వీటిపై సందేహాలు అక్కర్లేదని చెప్పారు.


logo