డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రీ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సూకీ టాప్ ప్రాంతం వద్ద రోడ్డుపైనే భారీ రాళ్లు వచ్చి పడ్డాయి. మరో వైపు ఆ ప్రాంతంలో నిరాటంకంగా వర్షం కురుస్తోంది. హైవేను క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చర్యలు చేపట్టినట్లు ఉత్తరకాశీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ దేవేంద్ర పట్వాల్ తెలిపారు.