సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 16:53:02

అయోధ్య భూమిపూజలో ఈ గణేషుడు ప్రత్యేకం

అయోధ్య భూమిపూజలో ఈ గణేషుడు ప్రత్యేకం

లక్నో : అయోధ్యలో జరుగనున్న శ్రీరాముడి దివ్య ఆలయం భూమిపూజ వేడుకలో ఇండోర్ గణేషుడు ప్రత్యేకంగా నిలువనున్నారు. ఈ వేడుకలో పవిత్ర పద్ధతితో వివిధ ఔషధాలతో తయారైన మాతి గణేషుడు తొలి పూజలందుకోనున్నది.

ఈ మాతి గణేషుడిని మట్టి, ఆవు పేడతోపాటు అడవుల నుంచి సేకరించిన 76 రకాల ఔషధాల మిశ్రమంతో తయారుచేసినట్లు మాతి గణేష్ వ్యవస్థాపకుడు జ్యోతి సుబోధ్ ఖండేల్వాల్ చెప్పారు. అన్ని విధాలుగా పూజలు జరిపిన అనంతరం ఆగస్టు 1 న శ్రీ రామ్ ఆలయ వాస్తుశిల్పి శ్రీ చంద్రకాంత్ భాయ్ సోంపురాకు పంపించామని ఆయన చెప్పారు. విగ్రాహానికి ఐదు రంగుల దారంతో తయారుచేసిన దండతో అలంకరించారు. 

ఈ 11 అంగుళాల విగ్రహంతో చంద్రకాంత్ భాయ్ కుమారుడు ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపురా అయోధ్యకు చేరుకోనున్నారు. 3 వ తేదీన గణపతి పూజతో భూమిపూజన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ ఇండోర్‌కు చెందిన మతి గణేష్ అనే గ్రంథాన్ని కూడా సత్కరిస్తారు.

పరమ పూజ్య శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి జీ, వేదాలు, అగమ శాస్త్రాల పండితుడైన ఆచార్య డాక్టర్ వినాయక్ పాండే జీ స్ఫూర్తితో 2014 లో శాస్త్రి మాతి గణేష్ విగ్రహాన్ని తయారుచేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శిల్పాలు ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, జోధ్‌పూర్, సూరత్, బరోడా, భోపాల్, జబల్పూర్‌కు తీసుకెళ్లనున్నారు.


logo