బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 22, 2020 , 16:32:12

క‌రోనా థీమ్‌తో గ‌ణ‌ప‌తి.. డాక్ట‌ర్లు, పోలీసులు, కార్మికులంద‌రున్నారు!

క‌రోనా థీమ్‌తో గ‌ణ‌ప‌తి.. డాక్ట‌ర్లు, పోలీసులు, కార్మికులంద‌రున్నారు!

చెన్నై : గణపతి బ‌ప్పా మొరియా! కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం వినాయ‌కుడి వేడుకలు తక్కువగానే జ‌రుగుతున్నాయి. కొవిడ్‌-19 ఉన్నప్పటికీ ప్రజలు బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే ఘ‌నంగా గణేశుడికి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో చెన్నైకి చెందిన నందిని విఘ్నేష్ అనే మ‌హిళ త‌న ఇంటిని క‌రోనా వైర‌స్ నేప‌థ్య గ‌ణేష్‌‌తో అలంక‌రించింది. పండుగ జ‌రుపుకోవ‌డానికి ఆమె వేలాది గ‌ణేష్ విగ్ర‌హాల‌ను సేక‌రించింది.

'మేము వినాయ‌క‌ విగ్రహాలను సేకరించడం ప్రారంభించాము. ఇప్పుడు మా ఇంట్లో 3500 విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను సేకరించడానికి మేము చాలా ప్రదేశాలకు వెళ్ళాము'‌ అని నందిని చెప్పుకొచ్చారు. గణేష్ చేతిలో ఫేస్‌మాస్క్, శానిటైజర్ ఉన్నందున ఈ విగ్రహం వ్యక్తిగత పరిశుభ్రత సందేశాన్నితెలియ‌జేస్తుంది. ఎలుక‌ కూడా ఫేస్‌మాస్క్‌ ధరించి ఉంది. విగ్రహాన్ని ఉంచిన వేదికపై కరోనావైరస్‌కు సంబంధించిన వాటిని  చూడవచ్చు. వైద్యులు, పోలీసు అధికారులు వంటి ఫ్రంట్‌లైన్ కార్మికుల కృషిని కూడా ఈ విగ్రహం తెలియ‌జేస్తుంది.