శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 11:05:17

భార్యపై దాడి చేసిన పోలీసు అధికారి.. వీడియో

భార్యపై దాడి చేసిన పోలీసు అధికారి.. వీడియో

భోపాల్‌ : ఓ పోలీసు అధికారి తన భార్యపై దాడి చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గాంధ్వాని పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నరేంద్ర సూర్యవంశీ అనే వ్యక్తి గాంధ్వాని పోలీసు స్టేషన్‌ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆ పోలీసు అధికారి మరొ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య.. తన భర్తను నిలదీసింది. వివాహేతర సంబంధానికి అడ్డుపడింది. దీంతో కోపోద్రిక్తులైన సూర్యవంశీ.. భార్యపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నరేంద్రను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. 


logo