మంగళవారం 07 జూలై 2020
National - Jun 24, 2020 , 12:15:40

గాల్వ‌న్ దాడి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న : చైనా ఆర్మీ అధికారులు

గాల్వ‌న్ దాడి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న :  చైనా ఆర్మీ అధికారులు

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ అధికారులు తెలిపారు.  కార్ప్స్ క‌మాండ‌ర్స్ స్థాయి స‌మావేశంలో చైనా ఆర్మీ అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.  ల‌డ‌ఖ్‌లోని వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి రెండు దేశాల ద‌ళాలు వైదొలిగేందుకు అంగీకారం తెలిపాయి.  రెండ‌వ సారి జ‌రిగిన సైనిక అధికారుల స్థాయి చ‌ర్చ‌ల్లో ప‌ర‌స్ప‌ర అంగీకారం కుదిరిన‌ట్లు భార‌త ఆర్మీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 

ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్‌, హాట్ స్ర్పింగ్స్‌, పాంగ్‌సాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ఉన్న ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని రెండు దేశాల సైనిక అధికారులు నిర్ణ‌యించారు.  జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులు ఎంత మంది చ‌నిపోయార్న విష‌యాన్ని మాత్రం ఆ దేశ సైనిక అధికారులు వెల్ల‌డించ‌లేదు. జూన్ 22వ తేదీన చైనా వైపున ఉన్న మోల్డోలో కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగాయి. గాల్వ‌న్ ఘ‌ట‌న ప‌ట్ల చైనా అధికారులు ముందు తీవ్ర ఖండ‌న వ్య‌క్తం చేశామ‌ని, వారు కూడా ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌డుతున్నార‌ని, మ‌ళ్లీ ఏదైనా గొడ‌వ జ‌రిగితే, ప్ర‌య‌త్నాల‌న్నీ వృధా అవుతాయ‌ని చైనా సైనిక అధికారులు కూడా అంగీక‌రించిన‌ట్లు ఓ భార‌తీయ‌ అధికారి తెలిపారు.
logo