శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 13, 2021 , 11:45:43

గాల్వ‌న్ యోధుల‌కు చ‌క్ర పుర‌స్కారాలు !

గాల్వ‌న్ యోధుల‌కు చ‌క్ర పుర‌స్కారాలు !

న్యూఢిల్లీ: గ‌త ఏడాది జూన్ 15వ తేదీన ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో .. భార‌త్‌, చైనా బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఆ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర మ‌ర‌ణం పొందారు.  చైనా వికృత దాడిలో అమ‌రులైన వారిలో తెలంగాణ‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కూడా ఉన్నారు.  ఈ సారి రిప‌బ్లిక్ డే రోజున యుద్ధంలో వీర మ‌ర‌ణం పొందిన సైనికులకు ఇచ్చే చ‌క్ర అవార్డుల‌ను ప్ర‌దానం చేసేందుకు కేంద్రం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 16వ బీహార్ రెజిమెంట్ క‌మాండింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ సంతోష్ బాబు గాల్వ‌న్ దాడిలో అమ‌రుడైన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ప‌ర‌మ‌వీర చ‌క్ర అవార్డును ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి.  సాధార‌ణంగా యుద్ధ యోధుల‌కు ఇచ్చే అవార్డుల‌ను ఈసారి బీహార్ రెజిమెంట్‌కు ప్ర‌ధానం చేసేందుకు ఆర్మీ ఉన్న‌త శ్రేణి అధికారులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  యుద్ధ స‌మ‌యాల్లో ఇచ్చే చ‌క్ర అవార్డుల్లో.. అత్యుత్త‌మైంది ప‌ర‌మ్‌వీర్ చ‌క్ర‌. ఆ త‌ర్వాత మహావీర్ చ‌క్ర‌, వీర చ‌క్ర అవార్డుల‌ను కూడా ఇస్తారు.  ఇక పీస్‌టైం గ్యాలంట్రీ అవార్డుల్లో అశోక చ‌క్ర‌, కీర్తి చ‌క్ర‌, శౌర్య చ‌క్ర‌లు ఉన్నాయి.  

  


logo