మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 12:11:36

గాల్వ‌న్ లోయ శాటిలైట్ ఫోటో.. హ‌ద్దులు మార్చిన పీఎల్ఏ

గాల్వ‌న్ లోయ శాటిలైట్ ఫోటో..  హ‌ద్దులు మార్చిన పీఎల్ఏ

హైద‌రాబాద్‌: ఈ శాటిలైట్ ఫోటో చూశారా ?  జూన్ 16వ తేదీన తీసిన ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ చిత్ర‌మిది.  ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫోటోను రిలీజ్ చేసింది.  భార‌త‌, చైనా బ‌ల‌గాలు ముష్టిఘాతానికి దిగింది ఇక్క‌డే. గాల్వ‌న్ న‌ది వెంట ఉన్న వ్యూహాత్మ‌క పెట్రోలింగ్ పాయింట్ 14 వ‌ద్ద ఇరు దేశాల‌కు చెందిన ద‌ళాలు కొట్టుకున్నాయి. ఆ బాహాబాహీలో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందారు. చైనాకు చెందిన 35 మంది సైనికులు కూడా మృతిచెందిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న‌ది. ప్రస్తుతానికి రెండు దేశాల స‌రిహ‌ద్ద వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. 

 గాల్వ‌న్ వ్యాలీలో పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన ద‌ళాలు.. స‌రిహ‌ద్దు మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు భార‌త విదేశాంగ‌శాఖ ఆరోపించింది. గ‌త వారం క‌మాండ‌ర్ స్థాయి అధికారులు కుదుర్చుకున్న ఒప్పందాలకు చైనా క‌ట్టుబ‌డి ఉంటే, ఈ స‌మ‌స్య ఉత్ప‌న్నం అయ్యేది కాదు అని భార‌త విదేశాంగ‌శాఖ పేర్కొన్న‌ది.  దీనిపై విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు వ‌రుస‌గా మంత‌నాలు జ‌రిగినా.. క‌ల్న‌ల్ ర్యాంక్ క‌మాండింగ్‌ ఆఫీస‌ర్‌ను కోల్పోయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.   logo