మంగళవారం 26 జనవరి 2021
National - Jan 12, 2021 , 01:36:33

సంతోష్‌బాబుకు గ్యాలంట్రీ అవార్డు!

సంతోష్‌బాబుకు గ్యాలంట్రీ అవార్డు!

న్యూఢిల్లీ, జనవరి 11: గతేడాది జూన్‌ 15వ తేదీ రాత్రి చైనా సైన్యంతో వీరోచిత పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ తేజం కర్నల్‌ సంతోష్‌బాబును సమున్నతంగా గౌరవించేందుకు కేంద్రం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంతోష్‌బాబుతోపాటు నాడు దేశ రక్షణలో వీర మరణం పొందిన 20 మంది బీహార్‌ రెజిమెంట్‌ సైనికులకు గ్యాలంట్రీ అవార్డులిచ్చే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.


logo