గురువారం 02 జూలై 2020
National - Jun 19, 2020 , 02:21:00

గల్వాన్‌ ఎప్పుడూ భారత్‌దే

గల్వాన్‌ ఎప్పుడూ భారత్‌దే

  • నదిని కనిపెట్టిన రసూల్‌గల్వాన్‌ మనుమడు అమిన్‌ గల్వాన్‌ వెల్లడి 

లేహ్‌, జూన్‌ 18: గల్వాన్‌ లోయ ఎప్పుడూ భారత భూభాగమేనని గులామ్‌ రసూల్‌ గల్వాన్‌ మనుమడు మొహమ్మద్‌ అమిన్‌ గల్వాన్‌ తెలిపారు. బ్రిటిష్‌ పాలనకాలం నుంచి ఈ ప్రాంతం భారత్‌లోనే ఉన్నదని వెల్లడించారు. 19వ శతాబ్దంలో గల్వాన్‌ నదిని కనిపెట్టింది అమిన్‌ తాత గులామ్‌ రసూల్‌ గల్వానే. ఆయన పేరుమీదుగానే ఈ లోయతోపాటు నదికి కూడా గల్వాన్‌ పేరు పెట్టారు. ‘ఈ లోయ నుంచి బ్రిటిష్‌ సాహసయాత్రికులను మా తాత రక్షించి సురక్షితంగా తీసుకొచ్చారు. 1878లో లేహ్‌లో జన్మించిన ఆయన 12వ ఏట నుంచే గైడ్‌గా పనిచేశారు. మధ్య ఆసియా, కారకోరం పర్వతాల్లో అనేక కొత్త ప్రదేశాలను కనిపెట్టారు. లార్డ్‌ డన్‌మోర్‌ అనే బ్రిటిష్‌ సాహసయాత్రికుడి బృందం ఈ లోయలో తప్పిపోతే దారి వెదకటానికి వెళ్లి గల్వాన్‌ నదిని కనిపెట్టారు. ఆ నదిగుండా వారిని సురక్షితంగా తీసుకురావటంతో డన్‌మోర్‌ ఆ నదికి మా తాత పేరు పెట్టారు. 1962 నుంచీ గల్వాన్‌ లోయను తమదేశంలో కలుపుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. కానీ ఈ ప్రాంతం ఇకముందు కూడా భారత్‌లోనే ఉంటుంది. మన సైనికులు గల్వాన్‌ లోయకోసం గొప్ప పోరాటం చేశారు. వారి త్యాగం వెలకట్టలేనిది’ అని పేర్కొన్నారు. 


logo