బుధవారం 08 జూలై 2020
National - Jun 16, 2020 , 16:21:19

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హైద‌రాబాద్ : ఒక‌వైపు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే.. మ‌రో వైపు గాల్వ‌న్ వ్యాలీలో చైనా బ‌ల‌గాలు తెగింపు ప్ర‌ద‌ర్శించిన తీరు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ల‌డ‌ఖ్‌లో కొన్నాళ్ల నుంచి కొన‌సాగుతున్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం.. ఇప్పుడు హైవోల్ట్ స‌మ‌స్య‌గా మారింది. కాల్పులు జ‌ర‌గ‌కుండానే.. జ‌రిగిన బాహాబాహీలు ముగ్గ‌రు భార‌తీయ సైనికులు మృతిచెందారు. చైనా ద‌ళాలు జ‌రిపిన దాడిలో ఓ క‌ల్న‌ల్‌తో పాటు ఇద్ద‌రు సైనికులు ప్రాణాలు కోల్పోయింది.  దీంతో ల‌డ‌ఖ్ లోయ‌లో ప‌రిస్థితి అత్యంత భీక‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త 40 ఏళ్ల‌లో రెండు దేశాల మ‌ధ్య ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

గాల్వ‌న్ ఘ‌ట‌న ప‌ట్ల మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ స్పందించారు. ఆ ఘ‌ట‌న చాలా క‌లిచివేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో భార‌తీయ సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ ప్ర‌శ్న వేశారు. జాతి ప్ర‌యోజ‌నాల‌ను ఉద్దేశించి.. ప్ర‌ధాని మోదీ, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌.. చైనాతో పేచీపై దేశ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. 

పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా స్పందించారు. గాల్వ‌న్ వ్యాలీలో త‌రుచూ చైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని, ఇలాంటి ఘ‌ట‌నల‌ను ఎదురునిల‌బ‌డి ఎదుర్కోవాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద రోజూ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని, కేంద్ర ప్ర‌భుత్వం దీని ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  గాల్వ‌న్ ఘ‌ట‌న‌తో స‌రిహ‌ద్దు ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉన్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు అని క‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. డీ ఎస్క‌లేష‌న్  ప్ర‌క్రియ స‌మయంలో భార‌త ఆర్మీ క‌ల్న‌ల్, జ‌వాన్లు చైనా చంపేసిందంటే ప‌రిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవాల‌న్నారు.‌logo