శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 19, 2020 , 14:49:48

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్

జైపూర్: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తన పదవికి రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేస్తూ మాట్లాడిన ఆడియో టేప్‌నకు సంబంధించి ఆయనపై కేసు నమోదైందన్నారు. ఈ అంశంపై ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారని అజయ్ మాకెన్ ప్రశ్నించారు. ఆడియో టేప్‌లో ఉన్న గొంతు తనది కాదంటున్న గజేంద్ర సింగ్, తన గొంతు నమూనాలు ఇచ్చి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఈ కేసు దర్యాప్తును ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని మాకెన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి గజేంద్ర సింగ్ రాజీనామా చేయాలి లేదా కేంద్రం ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
logo