సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:02:59

ఈ గాడ్జెట్ తో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చు

ఈ గాడ్జెట్ తో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చు

బెంగళూరు : కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు బెంగుళూరులోని మెడికల్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ యూనిట్ ఓ గాడ్జెట్ ను అభివృద్ధి చేసింది. ఈ గాడ్జెట్‌కు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ), యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆమోదం లభించింది. 

షైకోకాన్ అని పిలువబడే ఈ పరికరం ఒక చిన్న డ్రమ్ మాదిరిగా ఉంటుంది. దీనిని కార్యాలయాలు, పాఠశాలలు, మాల్స్, హోటళ్ళు, విమానాశ్రయం, ఏ క్యాంపస్‌లోనైనా ఉపయోగించుకునేందుకు వీలున్నది. ఇది కరోనా వైరస్ లో ఉన్న స్పైక్-ప్రోటీన్ లేదా ఎస్-ప్రోటీన్‌ను 99.9 శాతం వరకు తటస్తం చేస్తుంది. తద్వారా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి నిలిచిపోతుంది. కరోనా సోకిన రోగికి ఇది చికిత్స చేయదు. కానీ, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. షైకోకాన్ మిషన్ తో 26 పరీక్షలు చేయించుకున్న తరువత దీనికి యూఎస్‌ఎఫ్‌డీఏ, యూఈ ఆమోదం తెలిపాయని బెంగళూరుకు చెందిన డీ స్కేలీన్ కంపెనీ అధిపతి డాక్టర్ రాజా విజయ్ కుమార్ చెప్పారు. యూరప్, అమెరికా, మెక్సికోకు చెందిన కంపెనీలు లైసెన్సుల కోసం సంప్రదించాయని, భారీ ఉత్పత్తి కోసం వాటిని ఆమోదిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మిషన్ కు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. 

ఈ గాడ్జెట్ ఎలా పనిచేస్తుంది..?

ఈ గాడ్జెట్ గదిని లేదా ఇండోర్ ప్రాంతాన్ని వందలాది ఎలక్ట్రాన్లతో నింపుతుంది. కరోనా సోకిన వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చినా, గాలిలో ఉండే ఎలక్ట్రాన్లు దగ్గు, తుమ్ము, కఫం వల్ల కలిగే వైరస్ యొక్క ప్రాణాంతకతను తటస్తం చేస్తాయి. వైరస్ సోకిన వ్యక్తి ఒక వస్తువును తాకిన సందర్బాల్లో కూడా ఈ ఎలక్ట్రాన్లు దానిని తటస్తం చేస్తాయి.


logo