మంగళవారం 19 జనవరి 2021
National - Dec 27, 2020 , 20:52:07

పూజ సామగ్రిని కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే

పూజ సామగ్రిని కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే

లక్నో: శంకుస్థాపన కార్యక్రమానికి తనని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం చెందిన బీజేపీ ఎమ్మెల్యే అక్కడకు వెళ్లి హంగామా చేశారు. అంతటితో ఆగక పూజ సామగ్రిని కాలితో తన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బలూవా గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద గేటు పునరుద్ధరణ పనుల కోసం శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్లాపూర్ ఎమ్మెల్యే రమేష్ చంద్ర మిశ్రా ఈ విషయం తెలుసుకుని తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. తనను ఆహ్వానించకపోవడం, శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధి పేరు శిలాఫలకంలో ఉంచాలని తెలియదా అంటూ మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అంతటితో ఆగక శంకుస్థాపన కోసం ఉంచిన పూజ సామగ్రిని కాలితో తన్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.