శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 16:16:47

ఇండిగో ఉద్యోగులకు పూర్తి జీతం

ఇండిగో ఉద్యోగులకు పూర్తి జీతం

హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పౌరవిమానయానరంగంపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అంతర్జాతీయ విమానాలు, తాజాగా దేశీయ విమానాలను భారత్‌ రద్దు చేసింది. దీంతో విస్తారా, ఎయిర్‌ ఇండియా వంటి కంపెనీలతోపాటు, ఇండిగో, స్పైస్‌ జెట్‌ వంటి దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను పూర్తిగా రద్దుచేశాయి. దీంతో తమనకు నష్టాలు వస్తున్నప్పటికీ బడ్జెట్‌ ధరలకే విమానంలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్న ఇండిగో తన ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించి పూర్తి జీతం చెల్లిస్తామని ప్రకటించింది. ‘సర్వీసులు రద్దు చేసినప్పటికీ మా ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లిస్తామని’ ఇండిగో సీఈఓ రొనోజాయ్‌ దత్త పేర్కొన్నారు. 


logo