బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 17:04:20

ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 336 కరోనా కేసులు

ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 336 కరోనా కేసులు

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌పై భారత్‌ పోరాడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 336 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ  వెల్లడించారు. 'దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 56 మంది మృతి చెందారు. 56 మరణాల్లో 12 మంది గురువారం చనిపోయారు.  వ్యాధి నుంచి 157  మంది పేషెంట్లు కోలుకున్నారు.  మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 640 మంది  తబ్లీగీ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొన్నవారే. అత్యధికంగా 24 గంటల్లో 8వేల మంది శాంపిల్స్‌ టెస్టు చేశాం. తబ్లీగీ జమాత్‌ ద్వారా గత రెండు రోజుల్లో 647  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ 647 పాజిటివ్‌ కేసులు కేవలం 14 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని' లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.  


logo