మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:55:25

ఫ్రం రవీనా టాండన్‌ టూ నవాజ్‌ షరీఫ్‌.. ఇది మిగ్‌- 27 పేరు..!

ఫ్రం రవీనా టాండన్‌ టూ నవాజ్‌ షరీఫ్‌.. ఇది మిగ్‌- 27 పేరు..!

న్యూ ఢిల్లీ: మిగ్‌- 27 ఏంటి.. రవీనా టాండన్‌ టూ నవాజ్‌ షరీఫ్‌ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?ఇది కార్గిల్‌ యుద్ధసమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన. నేడు కార్గిల్‌ విజయ్‌దివస్‌ 21వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ఓ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి మిగ్‌- 27 యుద్ధవిమానంలో బాంబులు లోడ్‌ చేస్తుంటాడు. ఈ విమానంపై ‘ఫ్రం రవీనా టాండన్‌ టూ నవాజ్‌షరీఫ్‌’ అని రాసి ఉంది. యుద్ధసమయంలో పాకిస్తాన్‌ పీఎంగా ఉన్న నవాజ్‌ షరీఫ్‌కు అలనాటి బాలీవుడ్‌ తార రవీనా టాండన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌. అందుకే అలా ఎయిర్‌క్రాఫ్ట్‌పై రాశారట. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతోపాటు ‘జోర్‌ కా జట్కా.. ధీరే సే లగే..’ అని రాసి ఉన్న బాంబు ఫొటో కూడా వైరల్‌ అయ్యింది.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo