రైతుల ఉద్యమానికి ఉత్తేజమిస్తున్న పాటలు..!

చండీగఢ్: ఏ ఉద్యమానికైనా పాటలు ఊపిరిగా నిలుస్తాయి. ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రస్తుతం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్లో పాటలు ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఐక్యత, భూమిపై మమకారం, హక్కుల గురించిన చైతన్యాన్ని వారిలో కలిగిస్తున్నాయి. ఈ పాటలు వాట్సాప్, యూట్యూబ్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంపై వైరల్ అవుతున్నాయి.
కన్వర్ గ్రెవాల్ పాడిన ‘ఐలాన్’, ‘పెచా’ పాటలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. కన్వర్ ప్రస్తుతం తన మూడోపాట ‘జవానీ జిందాబాద్’ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ‘ఇది మాకు అత్యంత కీలక సమయం. మావి మట్టితో ముడిపడిన బతుకులు. మా హక్కులను మేం సాధించుకుంటాం.’ అని కన్వర్ పేర్కొన్నాడు. హార్ఫ్ చీమా రాసిన ‘పెచా’ పాటను.. చీమా, గ్రెవాల్ కలిసి పాడారు. దీనిని యూట్యూబ్‌లో 30 లక్షలకు పైగా మంది వీక్షించారు. ఈ పాటలో పంజాబ్, ఢిల్లీ మధ్యగల వ్యత్యాసాలు.. కేంద్ర సర్కారు చెడు విధానాలు, ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా రైతులు హైవేను అడ్డుకునే సన్నివేశాలను చూపించారు. వీటితోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటి నుంచి 70-80 నిరసన పాటలు విడుదలయ్యాయి. ప్రస్తుతం చాలా పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మిషన్ భగీరథ పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలి
- మొదటి రోజు 175 మందికి వ్యాక్సినేషన్
- నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితకు వినతి
- గొల్ల కురుమలకు చేయూత
- డ్రోన్ వ్యవసాయం
- విత్తనాలను త్వరగా నాటాలి
- వ్యాక్సినేషన్ సజావుగా నిర్వహించాలి
- క్రీడలతో మానసిక ఉల్లాసం
- కేసుల విషయంలో నిర్లక్ష్యం వద్దు
- వ్యాక్సిన్.. సక్సెస్