సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 17:36:07

110 రోజుల్లో లక్ష.. 49 రోజుల్లోనే 7లక్షలకు కరోనా కేసులు

110 రోజుల్లో లక్ష.. 49 రోజుల్లోనే 7లక్షలకు కరోనా కేసులు

న్యూఢిల్లీ:   భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. దేశంలో వరుసగా ఐదోరోజూ 20వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా  ఉద్ధృతి  మరింత దారుణంగా పెరుగుతుందన్న సంకేతాలే కనిపిస్తున్నాయే తప్ప తగ్గే సూచనలు కనిపించట్లేదు.  ప్రస్తుతం కొవిడ్‌-19 కేసుల జాబితాలో  మూడో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య  7లక్షలు  దాటింది.    మంగళవారం సాయంత్రం వరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 7,23,185కు చేరగా కరోనా బారినపడి ఇప్పటి వరకూ 20,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో  110 రోజుల్లో  ఒక లక్ష  కరోనా కేసులు నమోదు కాగా,  పాజిటివ్‌ కేసులు ఏడు రెట్లు పెరిగి, 7లక్షల మార్క్‌ దాటడానికి కేవలం 49 రోజులే పట్టింది.  లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపులు, అన్‌లాక్‌ తర్వాత కరోనా విజృంభిస్తున్నది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలో కోవిడ్‌-19  తీవ్రత అధికంగా ఉన్నది.  భారత్‌లో కరోనా  రికవరీ రేటు(61.13) శాతం  రోజురోజుకీ పెరుగుతున్నది.. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.8శాతంగా ఉన్నది.  మంగళవారం  వరకు దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల జాబితాలో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo