సోమవారం 01 జూన్ 2020
National - May 20, 2020 , 01:28:25

64 రోజుల్లో లక్ష కేసులు

64 రోజుల్లో లక్ష కేసులు

  • అగ్రరాజ్యాల కంటే భారత్‌ పరిస్థితి మెరుగు
  • అమెరికాలో 25 రోజుల్లోనే.. బ్రిటన్‌లో 42 రోజులు

న్యూఢిల్లీ, మే 19: అమెరికా, స్పెయిన్‌, ఇటలీ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరుకోవడానికి 64 రోజులు పట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, వరల్డో మీటర్స్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కేసులు కేవలం 25 రోజుల్లో 100 నుంచి లక్షకు చేరాయి. ఇక భారత్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు  సగటున 7.1 కరోనా కేసులు రికార్డయితే, ప్రపంచ వ్యాప్తంగా అది 60 కేసులుగా ఉంది. భారత్‌లో ప్రతి లక్ష మందికి 0.2 మంది మరణిస్తుండగా, అది ప్రపంచ వ్యాప్తంగా 4.1గా ఉంది. వైరస్‌ పురుడు పోసుకున్న చైనాలో (0.3) కంటే భారత్‌లో మృతుల రేటు తక్కువ. స్పెయిన్‌లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 59.2 మృతుల రేటు ఉండగా, ఇటలీలో 52.8, బ్రిటన్‌లో 52.1, ఫ్రాన్స్‌లో 41.9, అమెరికాలో 26.6గా నమోదైంది. 

కొత్తగా 4970 కేసులు.. 34 మంది మృతి

దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో 4,970 పాజిటివ్‌ కేసులు రికార్డుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1,01,139కి చేరుకున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 34 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3163కు చేరుకున్నది.logo