శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 18:00:15

మధ్యప్రదేశ్ లో దొరికిన అరుదైన జాతి కప్పలు.. వీడియో..

మధ్యప్రదేశ్ లో దొరికిన అరుదైన జాతి కప్పలు.. వీడియో..

భోపాల్ : మధ్యప్రదేశ్లోని నర్సింగాపూర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్గావ్‌లో అరుదైన జాతి పసుపు కప్పలు దొరికాయి. వీటిని చూసేందుకు చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సాధారణ కప్పల రంగు కాకుండా పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు. 

అమ్గావ్ గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డు పక్క గుంతలు నీటితో నిండిపోయి కప్పలు, ఇతర జీవులు పుట్టాయి. అయితే, పసుపు రంగులో రెండు డజనుకు పైగా కప్పలు బెకబెక మంటూ నీటిలో ఈదుతూ కనిపించాయి. పసుపు కప్పలు బయటకు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ కప్పల శబ్దం సాధారణ కప్పల నుంచి భిన్నంగా ఉన్నది. అవి ప్రమాదకరమైనవి కావని జంతు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

అమ్గావ్‌లో కనిపించిన పసుపు కప్పలు నిజానికి అరుదైన జాతివని,  వీటి శాస్త్రీయ నామం హోప్లోబ్రోటెకస్ టైగెరినస్ అని జంతు నిపుణులు, కప్పలపై పరిశోధనలు చేస్తున్న పుణెకు చెందిన డాక్టర్ ఆనంద్ పాండే చెప్పారు. ఇవి సాధారణంగా గోధుమ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి కప్పల సమూహం ముంబై, పుణె పరిసరాల్లో కనిపించాయని వెల్లడించారు. 

జూలై నెలలో వర్షాలు కురువగానే కప్పలు పుడతాయి. అయితే, ఇలాంటి జాతి కప్పలు సాధారణంగా అడవుల్లోని నీటి గుంటల్లోనే జీవిస్తాయి. పసుపు కప్పలు సాధారణంగా హౌరా పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తాయి. ఈ అరుదైన జాతి కప్పలు కనిపించడంతో పరిశోధనలు జరిపేందుకు జంతు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. కప్పలు పంటలను దెబ్బతీసే తెగుళ్ళను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. logo