శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 12:05:35

కోవిడ్‌-19 పేషెంట్ల డిశ్చార్జ్‌కు తాజా మార్గదర్శకాలు

కోవిడ్‌-19 పేషెంట్ల డిశ్చార్జ్‌కు తాజా మార్గదర్శకాలు

ఢిల్లీ : కోవిడ్‌-19 రోగులను డిశ్చార్జ్‌ చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేడు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మైల్డ్‌, వెరీ మైల్డ్‌, ప్రీ సింప్టమాటిక్‌ లక్షణాలతో కోవిడ్‌ కేర్‌లో చేరిన రోగులకు ప్రతి నిత్యం జ్వరం, నాడీని పర్యవేక్షించాలంది. కరోనా లక్షణాలు తగ్గిన 10 రోజుల అనంతరం వ్యక్తిని డిశ్చార్జ్‌ చేయొచ్చని తెలిపింది. అదీ కూడా వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకుండా ఉంటేనే అని తెలిపింది. డిశ్చార్జ్‌ చేసే సమయంలో సైతం ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదంది. ఆరోగ్యశాఖ సూచించిన విధంగా సదరు వ్యక్తికి తగిన సలహాలు, సూచనలను ఇవ్వాలంది. డిశ్చార్జ్‌ అనంతరం నియమాలను పాటిస్తూ మరొక 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలంది. శరీర ఉష్ణోగ్రతలను, ఆక్సిజన్‌ సంతృప్త స్థాయిలను బట్టీ వైద్య పరంగా కేసులను మోడరేట్‌ కేసులుగా విభజించాలంది. మోడరేట్‌ కేసుల్లో మూడు రోజులుగా జ్వరం లేకపోవడం, అదేవిధంగా నాలుగు రోజులపాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ లేకుండా 95 శాతం సంతృప్త స్థాయిని కలిగిఉంటే అటువంటి రోగులను 10 రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేయొచ్చని పేర్కొంది. 


logo