బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 21:14:59

అర్నబ్‌ గోస్వామిపై మరో కేసు నమోదు

అర్నబ్‌ గోస్వామిపై మరో కేసు నమోదు

ముంబై: : రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిపై ముంబై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీస్‌ అధికారులను అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించింనందుకు అర్నబ్‌తోపాటు ఆయన భార్యపై పలు సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో 2018లో 53 ఏండ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అన్వే నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న కేసునకు సంబంధించి ముంబై పోలీసులు బుధవారం అర్నబ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ సందర్భంగా అర్నబ్‌తోపాటు ఆయన భార్య, పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా పోలీస్‌ పట్ల చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇద్దరు పోలీస్‌ అధికారులు తనపై దాడి చేసినట్లు అర్నబ్‌ ఆరోపించారు. అర్నబ్‌ కుటుంబ సభ్యలును కూడా పోలీసులు తోసివేశారని, ఆయన ఇంటిని మూడు గంటల పాటు దిగ్బంధించారని ఆయన తరఫు న్యాయవాది గౌరవ్ పార్కర్ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.