శనివారం 23 జనవరి 2021
National - Dec 26, 2020 , 10:25:58

దేశంలో కొత్తగా 22,272 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 22,272 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,272 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,01,69,118కు పెరిగాయి. మరో 251 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,81,667 ఉన్నాయని పేర్కొంది. గత 24 గంటల్లో 22,274 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో 8,53,527 మందికి టెస్ట్‌ చేయగా.. మొత్తం 16,17,59,289 శాంపిల్స్‌ పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.


logo