శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 17:23:00

కేరళలో 24 గంటల్లో ఒక్కటే కరోనా పాజిటివ్‌ కేసు

కేరళలో 24 గంటల్లో ఒక్కటే కరోనా పాజిటివ్‌ కేసు

తిరువనంతపురం: కేరళలో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసు ఒకే ఒక్కటి నమోదైందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అంతేగాక శుక్రవారం 10 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన  వ్యక్తి  మూత్రపిండాలు చికిత్స కోసం  ఇటీవల చెన్నై నుంచి ఎర్నాకులం వచ్చినట్లు సీఎం తెలిపారు. 

ఇవాళ కరోనా పరీక్ష చేయగా నెగటెవ్‌గా తేలిన పది మంది కూడా కన్నూర్‌ జిల్లాకు చెందినవారే. కేరళలో ఇవాళ్టి వరకు మొత్తం 503 మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం కేవలం 16(యాక్టివ్‌ కేసులు) మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo