శుక్రవారం 05 జూన్ 2020
National - May 20, 2020 , 00:49:49

జేఈఈ-మెయిన్‌ దరఖాస్తులకు మరో చాన్స్‌!

 జేఈఈ-మెయిన్‌ దరఖాస్తులకు మరో చాన్స్‌!

  • ఈ నెల 24 వరకు అవకాశం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్‌ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందు విదేశాల్లో విద్యాభ్యాసానికి ప్రణాళికలు వేసుకున్న విద్యార్థులు.. జేఈఈ-మెయిన్‌కు దరఖాస్తు చేసుకోలేదు. కరోనాతో మారిన పరిస్థితుల వల్ల దేశంలోనే తమ చదువులు కొనసాగించాలని నిర్ణయించుకున్నామని.. కనుక తమకు జేఈఈ-మెయిన్‌ రాసేందుకు అవకాశం కల్పించాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వారికి తాజాగా అవకాశం ఇవ్వాలని ఎన్టీఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మంగళవారం (ఈ నెల19) నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఎన్టీఏ డైరెక్టర్‌ వినీత్‌ జోషి చెప్పారు. ఏప్రిల్‌లో జరుగాల్సిన జేఈఈ-మెయిన్‌ పరీక్ష కరోనా వల్ల జూలై 18-23 తేదీలకు వాయిదా పడింది.


logo