టీకా ఖర్చు కేంద్రానిదే

- 3 కోట్ల మంది వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా టీకా
- తొలి విడుతలో ప్రజాప్రతినిధులు పాల్గొనద్దు
- సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి విడుతలో 3 కోట్ల మంది వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్‌కు అయ్యే మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి, టీకా పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి విడుత వ్యాక్సినేషన్ కేవలం వైద్యారోగ్య సిబ్బంది, హెల్త్‌కేర్ వర్కర్లకేనని, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనవద్దని సూచించారు. రెండు ‘మేడిన్ ఇండియా’ టీకాలైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ ధరలు.. ప్రపంచంలోని ఇతర టీకాలతో పోలిస్తే అత్యంత చౌక అని ప్రధాని చెప్పారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలుకానున్నది.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ఆమోదం
కొవాగ్జిన్‌పై వస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజలకు సమర్థమైన టీకాలు అందించేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మేడిన్ ఇండియా టీకాలు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడి ఉంటే దేశం ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చేదో ఊహించుకోవాలన్నారు. వ్యాక్సిన్లపై వదంతులను కట్టడి చేయాలని సూచించారు.
కొవిషీల్డ్ రూ. 210 కోటి డోసులకు కేంద్రం ఆర్డర్
కరోనా టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ను 6 కోట్ల డోసులు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీనికి రూ.1,300 కోట్ల ఖర్చు కానున్నది. ఈ మేరకు కొవిషీల్డ్ ఉత్పత్తిదారు ఎస్‌ఐఐకు సోమవారం 1.1 కోట్ల డోసులకు కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో డోసు ధర రూ.210. ఏప్రిల్‌లోపు మరో 4.5 కోట్ల డోసులు కొంటామని హామీ ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా 55 లక్షల డోసుల కొనుగోలుకు కూడా కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 16 నుంచి తొలి దశ టీకా పంపిణీ ప్రారంభం కానున్నది. ముందుగా 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేయనున్నారు.
తాజావార్తలు
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ