శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 07:38:04

వృద్ధులకు ఇంటివద్దకే ఉచితంగా ఆహారం

వృద్ధులకు ఇంటివద్దకే ఉచితంగా ఆహారం

చెన్నై : చెన్నై, దాని సమీప ప్రాంతాల్లోని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, నిరాశ్రయులకు ఉచితంగా ఆహారాన్ని ఇంటివద్దనే అందించనున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ఆశయంతో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైతో పాటు చెంగెల్పేట్‌, కాంచీపురం, తిరువల్లూరు ప్రాంతాలలో అమ్మ క్యాంటీన్లు కొనసాగుతాయన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు కమ్యూనిటీ కిచెన్లను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు.


logo