బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 19:22:38

సైబర్‌ మోసగాళ్లు దలైలామాను కూడా వదల్లేదు

సైబర్‌ మోసగాళ్లు దలైలామాను కూడా వదల్లేదు

ధర్మాశాల: సైబర్‌ మోసగాళ్ల చేతిలో ఎక్కడొ ఒకచోట ఎవ్వరో ఒకరు మోసపోవడం మనం  చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా చెవికెక్కించుకోకుండా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి నిండా మునుగుతున్నారు. రోజుకోరీతిలో సైబర్‌ నేరగాళ్లు తమ పంజా విసురుతూ డబ్బు దండుకొంటున్నారు. ఈ దుర్మార్గులు బౌద్ధ గురువు దలైలామా పేరును కూడా వలడంలేదు. దలైలామాకు అత్యంత ఆప్తుడైన 35 ఏండ్ల లింగ్‌ రిన్‌పోచే పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని తయారుచేసి కరోనా బాధితులను ఆదుకొనేందుకు ఆర్థికంగా సాయపడాలంటూ సైబర్‌ మోసగాళ్లు కోరుతున్నారు. 

తన పేరుతో నకిలీ పేజీని ప్రారంభించి నిధులు సమీకరిస్తున్న విషయం పలువురు అనుచరుల ద్వారా తెలుసుకొన్న లింగ్‌ రిస్‌పోచే.. ఈ విషయాన్ని ఢిల్లీ సైబర్‌ పోలీసుల దృష్టికి తీసుకొచ్చి ఫిర్యాదు నమోదుచేశారు. దాంతో పోలీసులు సైబర్‌ నేరగాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరును దుర్వినియోగం చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు దండుకోవడమే లక్ష్యంగా ఇలాంటి  మోసాలకు పాల్పడి ఉండొచ్చని ఢిల్లీ సైబర్‌ సెల్‌ డీసీపీ భీషమ్‌సింగ్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా రిస్‌పోచే ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో నివసిస్తున్నారు.


logo