ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:32:05

భార‌త్‌కు వైద్య సామా‌గ్రి అంద‌జేసిన ఫ్రాన్స్‌

భార‌త్‌కు వైద్య సామా‌గ్రి అంద‌జేసిన ఫ్రాన్స్‌

న్యూఢిల్లీ: ‌భార‌త్‌ప‌ట్ల ఫ్రాన్స్ ఉదార‌త‌ చాటింది. క‌రోనా నేప‌థ్యంలో వైద్య సహాయానికి ముందుకొచ్చింది.  వెంటిలేట‌ర్లు, క‌రోనా ప‌రీక్ష కిట్లు వంటివి అంద‌జేసింది. ఫ్రాన్స్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ చేరిన వైద్య సామాగ్రిని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగ‌ళ‌వారం భారత‌ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఆర్.కె.జైన్ కు అందజేశారు. ఒసిరిస్ -3 వెంటిలేటర్లు 50, యువెల్ 830 వెంటిలేటర్లు 70, 50 వేల ఐజిజి / ఐజిఎం క‌రోనా టెస్ట్ కిట్లు, 50 వేల ముక్కు, గొంతు స్వాబ్స్ ప‌రిక‌రాల‌ను భార‌త్‌కు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు పేర్కొన్నారు.logo