సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 17:34:30

న‌లుగురిని హ‌త్య చేసిన మావోయిస్టులు

న‌లుగురిని హ‌త్య చేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగ‌లూర్ ప‌రిధిలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కుర్చేలి గ్రామానికి చెందిన న‌లుగురు వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హ‌త‌మార్చారు. మ‌రికొంత‌మంది గ్రామ‌స్తుల‌ను మావోలు కిడ్నాప్ చేశారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. 

ఇలాంటి ఘ‌ట‌నే సెప్టెంబ‌ర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మోట‌పాల్ - పూనూర్ స‌మీపంలో  న‌లుగురు వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హ‌త్య చేశారు. మోట‌పాల్ గ్రామానికి చెందిన 25 మందిని మావోయిస్టులు అప‌హ‌రించారు. అనంత‌రం ప్ర‌జాకోర్టు నిర్వ‌హించి న‌లుగురు వ్య‌క్తుల గొంతు కోసి చంపారు మావోయిస్టులు. ఆ త‌ర్వాత ఐదుగురిని విడుద‌ల చేసిన మావోయిస్టులు.. మిగ‌తా 16 మందిని త‌మ ఆధీనంలోనే ఉంచుకున్నారు.   


logo