శనివారం 28 మార్చి 2020
National - Feb 15, 2020 , 22:32:45

నలుగురు చిన్నారులు సజీవదహనం

నలుగురు చిన్నారులు సజీవదహనం

ఛండీగఢ్ : స్కూల్‌ వ్యాన్‌లో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలోని లోంగోవాల్‌- సిడ్సమాచార్‌ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. ఓ ప్రైవేట్‌ పాఠశాల చెందిన 12 మంది విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం వ్యాన్‌లో తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గమనించి 8 మందిని రక్షించారు. మరో నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మరణించినవారంతా 10 నుంచి 12 ఏండ్లలోపు వారే. ఈ ప్రమాదంపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడు చెప్పలేమని విచారణ అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు. logo