గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 12:59:42

అసోం, యూపీ, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు

అసోం, యూపీ, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు

ఢిల్లీ : అసోం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, ఉత్త‌రాఖండ్ రాష్ర్టాల్లో నేడు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది. భార‌త వాతావ‌ర‌ణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్ర‌కారం గుజ‌రాత్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు అదేవిధంగా ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ప‌శ్చిమాన‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అసోం రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. 

ఐఎమ్‌డి ఇంతకుముందు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... జులై 26-28 మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో అదేవిధంగా జులై 27-29 మధ్య పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయంది. జూలై 26-29 మధ్యకాలంలో ఉప-హిమాలియన్ పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందంది. 


logo