గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 11:59:37

జూలై చివ‌ర్లో భార‌త్‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాలు..

జూలై చివ‌ర్లో భార‌త్‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాలు..


హైద‌రాబాద్‌: త్వ‌ర‌లో భార‌త వైమానిక సామ‌ర్థ్యం పెర‌గ‌నున్న‌ది.  ర‌ఫేల్ యుద్ధ విమానాలు .. భార‌త్‌కు రానున్నాయి. జూలై చివ‌రిలోగా నాలుగు ర‌ఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు రానున్న‌ట్లు తెలుస్తున్న‌ది. వాస్త‌వానికి మే చివ‌రిలోగా యుద్ధ‌విమానాలు డెలివ‌రీ కావాల్సి ఉన్న‌ది. అయితే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆ యుద్ధ విమానాల డెలివ‌రీ వాయిదా ప‌డింది. దీంట్లో మూడు రెండు సీట్ల విమానాలు, ఒక‌టి సింగిల్ సీట‌ర్ ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. అంబాలా ఎయిర్‌బేస్‌కు విమానాలు రానున్నాయి. ర‌ఫేల్ కొనుగోలులో కీల‌క పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బ‌దౌరియాకు స‌ముచిత గౌర‌వం ఇవ్వ‌నున్నారు. విమానాల టెయిల్ నెంబ‌ర్ల‌కు ఆర్‌కే సిరీస్ ఇవ్వ‌నున్నారు. 17 గోల్డెన్ ఆర్సో స్క్వాడ్ర‌న్ పైల‌ట్ తొలి విమానాన్ని భార‌త్‌కు తీసుకురానున్నారు. మార్గ‌మ‌ధ్యంలో మిడిల్ఈస్ట్‌లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంక‌ర్‌లో ఇంధ‌న నింప‌నున్నారు. వాస్త‌వానికి సింగిల్ జ‌ర్నీలో ఇండియాకు రావొచ్చు, కానీ చిన్న కాక్‌పిట్‌లో సుమారు 10 గంట‌ల పాటు కూర్చోవ‌డం స‌రికాదు అని అధికారులు పేర్కొన్నారు. ర‌ఫేల్ విమానాల‌ను న‌డిపే భార‌తీయ పైల‌ట్లు కూడా శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. 36 ర‌ఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో 60 వేల కోట్ల డీల్‌ను భార‌త్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. 



logo