గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 11:31:57

క‌స్టోడియ‌ల్ డెత్ కేసు: పోలీసుల అరెస్టుతో ప‌టాకుల పండుగ‌.. వీడియో

క‌స్టోడియ‌ల్ డెత్ కేసు: పోలీసుల అరెస్టుతో ప‌టాకుల పండుగ‌.. వీడియో

చెన్నై: త‌మిళ‌నాడు రాష్ట్రం ట్యుటికోరిన్‌లోని క‌స్టోడియ‌ల్ డెత్ కేసుకు సంబంధించి సీబీ-సీఐడీ ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే ఎస్సై ర‌ఘు గ‌ణేశ్‌ను అరెస్ట్ చేసిన సీబీ-సీఐడీ పోలీసులు తాజాగా మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ బాల‌కృష్ణ‌న్‌తోపాటు కానిస్టేబుళ్లు ముత్తురాజ్‌, మురుగ‌న్‌ల‌ను గురువారం ఉద‌యం అరెస్ట్ చేశారు. కాగా, ఘ‌ట‌నకు సంబంధించి ఇప్ప‌టికే స‌స్పెండైన ఎస్సై ర‌ఘుగ‌ణేశ్‌ను బుధ‌వారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో క‌స్టోడియల్ డెత్‌కు బాధ్యులైన న‌లుగురు పోలీసులు అరెస్ట‌యిన‌ట్ల‌య్యింది. దీంతో బాధిత గ్రామాలైన‌ స‌తంకులం, తూత్తుకూడి వాసులు ప‌టాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. 


logo