ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 08:05:10

నాటుబాంబు పేలి నలుగురికి తీవ్రగాయాలు

నాటుబాంబు పేలి నలుగురికి తీవ్రగాయాలు

కోయంబత్తూర్‌ :  తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. రిపబ్లిక్‌ డే వేడుకలకు ముందు బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెరినాయికెన్పాలయం సమీపంలోని జ్యోతిపురం గ్రామం నందిని కాలనీలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అదే కాలనీకి చెందిన మణిమళన్‌, కే రాజు, రామరాసు, పుంతిరాయ్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.  ఇంట్లో నాటుబాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఘటనాస్థలానికి బాంబు స్క్వాడ్‌ బృందం, బాంబు నిర్వీర్యం చేసే నిపుణులు చేరుకొని తనిఖీ చేశారు. అడవి పందులను వేటాడేందుకే వీరు బాంబులను తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo