సోమవారం 06 జూలై 2020
National - Apr 03, 2020 , 16:25:01

ఉగ్రవాద సంస్థతో సంబంధాలు..నలుగురు కార్మికులు అరెస్ట్‌

ఉగ్రవాద సంస్థతో సంబంధాలు..నలుగురు కార్మికులు అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ పోలీసులు నలుగురు భూగర్బగని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు లష్కరే యీ తోయిబా తీవ్రవాద సంస్థతో సంబంధమున్నట్లు భావించిన పోలీసులు..వారిని అరెస్ట్‌ చేశారు.

కుప్వారా జిల్లాలోని షల్పోరా ప్రాంతంలో తీవ్రవాదులున్నారన్న సమాచారం రావడంతో..గురువారం రాత్రి కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించిన జమ్మూకశ్మీర్‌ భద్రతాబలగాలు, పోలీసులు సంయుక్తంగా నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఇద్దరిని ఆజాద్‌ అహ్మద్‌ భట్‌, అల్తఫ్‌ అహ్మద్‌ బాబాగా గుర్తించాం. వారి వద్ద నుంచి రెండు పిస్తోళ్లు, రెండు హ్యాండ్‌ గ్రైనేడ్లు స్వాధీనం చేసుకున్నామని భద్రతాదళ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo