శనివారం 16 జనవరి 2021
National - Dec 26, 2020 , 15:12:31

ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవ దహనం

ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవ దహనం

లక్నో : ఇంటికి మంటలు అంటుకొని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బందా జిల్లాలోని దుబెన్ కా పుర్వా గ్రామంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం సంగీతా యాదవ్ (28) అనే మహిళ ఇంటి నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. వారు స్పందించి మంటలు ఆర్పేలోపే మంటలు అంటుకొని సంగీతతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడు చనిపోయారని ఏఎస్‌పీ మహేంద్ర సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌, పోలీస్‌ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.