శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 15:57:28

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో న‌లుగురు మావోయిస్టులు లొంగుబాటు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో న‌లుగురు మావోయిస్టులు లొంగుబాటు

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో న‌లుగురు మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా ఎస్ఎస్‌పీ సిద్ధార్థ తివారీ, ఎస్పీ శ‌ల‌భ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కొంద‌రు అధికారుల స‌మ‌క్షంలో ఈ న‌లుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన న‌లుగురు మావోయిస్టుల‌లో ముగ్గురి త‌ల‌ల‌పై రూ.8 ల‌క్ష‌ల చొప్పున రివార్డు ఉంద‌ని పోలీసులు తెలిపారు. న‌లుగురు మావోయిస్టుల‌లో ముగ్గురు మ‌గ‌వారు కాగా, ఒక మ‌హిళ ఉన్న‌ట్లు వారు వెల్ల‌డించారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo