శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:21:11

ఆ న‌లుగురు పర్వతారోహకులు సుర‌క్షితం

ఆ న‌లుగురు పర్వతారోహకులు సుర‌క్షితం

డెహ్రాడూన్ : కేదార్‌నాథ్ ఆలయం నుంచి వాసుకి తాల్ వెళ్లే సమయంలో తప్పిపోయిన నలుగురు ప‌ర్వ‌తారోహ‌కులు సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం గురువారం వెల్ల‌డించింది. త‌ప్పిపోయిన న‌లుగురితో ఆ రాష్ర్ట సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ మాట్లాడి.. యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు.  ఆ న‌లుగురిని త‌ర‌లించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్ర‌మిస్తున్నాయి. ప‌ర్వ‌తారోహ‌కులు హిమాన్షు గురుంగ్, హ‌ర్ష్ భండారి, మోహిత్ భ‌ట్, జ‌గ‌దీష్ బిష్ట్.. డెహ్రాడూన్, నైనిటాల్ జిల్లాలకు చెందినవారు.

న‌లుగురు ప‌ర్వ‌తారోహ‌కులు త‌ప్పిపోయిన‌ట్లు పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాల‌కు జులై 14న స‌మాచారం అందించారు. దీంతో వాసుకి తాల్ మార్గంలో ఆ బృందాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. కేదార్ నాథ్ నుంచి కూడా ఒక బృందాన్ని పంపించారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో ఆప‌రేష‌న్ కొన‌సాగించ‌లేదు. మొత్తానికి ప‌ర్వ‌తారోహ‌కుల‌ను గుర్తించామ‌ని తెలిపారు. త్రియుగినారాయ‌ణ గ్రామానికి స‌మీపంలోని ఓ కొండ‌పై న‌లుగురు ఉన్న‌ట్లు గుర్తించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఒక హెలికాప్ట‌ర్ ను అందుబాటులో ఉంచారు. వీలైనంత త్వ‌ర‌గా ప‌ర్వ‌తారోహ‌కుల‌ను సుర‌క్షితంగా తీసుకువ‌స్తామ‌ని అధికారులు పేర్కొన్నారు. 


logo