మంగళవారం 31 మార్చి 2020
National - Feb 26, 2020 , 09:04:36

లారీ-అంబులెన్స్‌ ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు

లారీ-అంబులెన్స్‌ ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు

అమరావతి: ఏపీలోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి నుంచి బెంగాల్‌కు మృతదేహాన్ని తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


logo
>>>>>>