బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 16:10:53

కండ్ల ముందే క‌న్న‌వాళ్లు, తోబుట్టువులు మృతి

కండ్ల ముందే క‌న్న‌వాళ్లు, తోబుట్టువులు మృతి

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇండోర్‌కు చెందిన భార్య‌భ‌ర్త‌లు ‌మ‌హారాష్ట్ర‌కు వ‌ల‌స‌వెళ్లి కూలీలుగా జీవ‌నం గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం త‌మ న‌లుగురు పిల్ల‌ల‌తో క‌లిసి బైక్‌పై స్వ‌గ్రామానికి బ‌య‌లుదేరారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బ‌ర్వానీ జిల్లాకు చేరుకున్న త‌ర్వాత ఎదురుగా వ‌స్తున్న ట్యాంక‌ర్ అదుపుత‌ప్పి వీరి బైకును ఢీకొట్టింది. ప్ర‌మాదంలో భార్య‌, భ‌ర్త‌, వారి ఇద్ద‌రు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు చిన్నారులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో పోలీసులు మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి, గాయ‌ప‌డ్డ చిన్నారిలిద్ద‌రిని జిల్లా ఆస్ప‌త్రిలో చేర్చారు.  అయితే, కండ్ల ముందే అమ్మ‌, నాన్న‌తోపాటు ఇద్ద‌రు తోబుట్టువులు విగ‌త జీవులుగా మార‌డంతో ఆ చిన్నారులు వెక్కివెక్కి ఏడుస్తున్నారు. 


logo