శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 29, 2020 , 16:13:27

ఆస్ప‌త్రి నిర్లక్ష్యం.. ఒకేరోజు న‌లుగురు ప‌సికందులు మృతి

ఆస్ప‌త్రి నిర్లక్ష్యం.. ఒకేరోజు న‌లుగురు ప‌సికందులు మృతి

భోపాల్: మ‌ధ్యప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. షాదోల్ జ‌ల్లా ఆస్ప‌త్రిలో వైద్యులు, ఇత‌ర సిబ్బంది నిర్ల‌క్ష్య వైఖ‌రివ‌ల్ల కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే న‌లుగురు ప‌సికందులు మృతిచెందారు. ఆస్ప‌త్రి అథారిటీ నిర‌క్ష్య దోర‌ణి తాము ప‌సిబిడ్డ‌ల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలిన వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, బాధితుల ఆరోప‌ణ‌ల‌ను ఆస్ప‌త్రి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ తోసిపుచ్చారు. ప‌సికందుల మృతి విష‌యంలో త‌మ‌ త‌ప్పిద‌మేమీ లేద‌న్నారు. చిన్నారులంద‌రినీ సీరియ‌స్ కండిష‌న్‌లో ఇక్క‌డికి తీసుకొచ్చార‌ని, అందుకే వారిలో కొంద‌రు మ‌ర‌ణించార‌ని చెప్పారు.  logo